*సినీరంగంలో ‘”రాణి'”స్తున్న ఖమ్మం స్వప్న చౌదరి…















*వెండితెరపై.. నటనా వెలుగుల రారాణి అమ్మినేని స్వప్న చౌదరి..వేదికలపై అలవోకగా యాంకరింగ్ లో వాగ్ధాటి..
*నమస్తే సేట్ జీ తెలుగు చలన చిత్రంతో హీరోయిన్ గా స్వప్న చౌదరీ తెరంగేట్రం..
*మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ హీరోయిన్ స్వప్న చౌదరి అతివకు వెండితెర ఆహ్వానం..
*మెగాస్టార్ చిరంజీవి, సినీ గేయ రచయిత చంద్రబోస్, సీనియర్ నటులు తనికెళ్ల భరణి, బ్రహ్మానందం ఆశీస్సులతో రాణిస్తున్న ఖమ్మం జిల్లా వాసి సినీ స్వప్న చౌదరి అమ్మినేని..
తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా తన స్వరాన్ని తియ్యటి తెలుగు పదాలను అలవోకగా.. అద్వితీయంగా.. ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న తెలుగు 18 యేండ్ల పరికిని.. గత 8 యేండ్ల క్రితమే వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుని నమస్తే సేట్ జీ సినిమా తో. ఆరంగేట్రం చేసి మిస్టరీ మూవీలో కూడా హీరోయిన్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు..ఖమ్మం జిల్లాకు చెందిన ఈ అమ్మడు.. హీరోయిన్ గా రాణిస్తూ.. వెండి తెరలో, యాంకర్ గా రెండు విభాగాలలో. మహా రాణి వలె రాణిస్తుంది..
భారీ ఈవెంట్ వేదికలపై తన తీయటి కోయిల స్వరంతో తన అచ్చ తెలుగు పదాలతో ఆహుతులను ఆహా… అనిపించేలా స్వరం.. గాత్రం.. అభినయం.. ఉంటేనే.. ఆ..వేదికకే.అందం.. ఆ..అందమైన స్వరం, అభినయం గల యువతీ మన స్వప్న చౌదరియే….మైక్ పట్టుకుని వేదికపై తను సంభాషించిందంటే ఆహుతులంతా ఆసక్తిగా ఆమె వంక..అలా..ఆమె పదాలను వినడం తప్ప మరో ధ్యాస ఉండదని చెప్పవచ్చు. అంతటి గొప్ప టాలెంటున్న..యువతి.. ఖమ్మం సుమ అని పేరున్న ఈ అమ్మడు.. వెండి తెర వైపు అడుగులు వేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుని చిన్న సినిమాలలో ఏకంగా సినిమా హీరోయిన్ గా తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయమై శభాష్ ఖమ్మం యువతిగా రాణిస్తుంది…*
తన పాదాలపై తాను నిలబడి.. ఏ రంగంలోనైనా స్వశక్తిగా ఎదిగి నలుగురికి ఆదర్శంగా నిలవాలి అని చెప్పే నిర్వచనాన్ని ఈఖమ్మం అమ్మడు నిజం చేస్తుందీ. ఈ18 ఏండ్ల యువతి.. తొలుత యాంకరింగ్ లో తెలుగు అక్షరాలకే పురస్కారాలు దక్కే విధంగా తన వాగ్ధాటితో ఈ అమ్మడు ఔరా అనిపించి..మన ఖమ్మం జిల్లాకే వన్నె తెచ్చిపెట్టిన మగువ… ఇంతకీ ఆ అమ్మడు ఎవరు అనేదే కదా.. మీ సందేహం.. ఇంకెవరoడి. ఖమ్మం జిల్లా వాసి..మన స్వప్న చౌదరి అమ్మినేని…
సినీ వివరాలు..
సుమారు 1470 వేదికల పై యాంకరింగ్ చేశారు.
2024 అక్టోబర్ లో దుబాయ్ దేశంలో గల్ఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు స్వప్న చౌదరి యాంకరింగ్ చేసి తెలుగు ప్రజల సాంప్రదాయంను విశ్వవ్యాప్తం చేసి ఔరా అనిపించారు..
*2025 జనవరి లో శ్రీలంక దేశంలో జరిగిన ఈవెంట్ సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగ ఔన్నత్యాన్ని తన యాంకరింగ్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు.
*మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం వరించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజిని వారి నివాసంలోనే మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి మెగాస్టార్ చిరుతో ఆశీర్వచనాలు పొందారు..
*సినీ గేయ రచయిత చంద్రబోస్ ని మిస్టరీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కలిసి చంద్రబోస్ ఆశీస్సులు పొందారు..
*సీనియర్ నటులు సిని కథ రచయిత తనికెళ్ల భరణి, హీరొ సుమన్, హీరొ ఆలీతో మిస్టరీ సినిమా లో కలిసి నటించి నటనలో వారివద్ద నుంచి మెలకువలు నేర్చుకుంది ఈముద్దుగుమ్మ..
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
