వినోద్ ఫిల్మ్ అకాడమీ 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ
ఎందరో నటీనటులను తీర్చిదిద్ది తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్న వినోద్ ఫిల్మ్ అకాడమీ 6వ వార్షికోత్సవ వేడుకలు మే 28న, మహానటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా అకాడమీ వ్యవస్థాపకులు వినోద్ నువ్వుల మాట్లాడుతూ, “ఒక మహనీయుడైన ఎన్టీఆర్ గారి జయంతి రోజున మా అకాడమీని ప్రారంభించడం, గత ఆరు సంవత్సరాలుగా ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులను తయారు చేయడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.
అకాడమీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, “ప్రపంచ చరిత్రలో నాటి నుంచి నేటి వరకు అద్భుతమైన నటుల్లో అగ్రగామిగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్ గారు అందరికీ ఆదర్శప్రాయులు” అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫ్యాకల్టీ సభ్యులు బబ్లు, విజయభారత్, ఈశ్వర్, ఉషాశ్రీతో పాటు అకాడమీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. వారిలో తల్లాడ సాయికృష్ణ, గుర్రపు విజయ్ కుమార్, ప్రణయ్ రాజ్, ప్రముఖ నటులు అప్పు శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అలాగే వినోద్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొంది ప్రస్తుతం వివిధ సినిమాల్లో నటిస్తున్న ప్రదీప్, రాము, మురళి తదితర కళాకారులు హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, “వినోద్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు సినీ రంగంలో విజయవంతంగా రాణించడం ఎంతో సంతోషకరం. భవిష్యత్తులో మరెంతోమంది కళాకారులను ఈ అకాడమీ తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాలని ఆకాంక్షిస్తున్నాము” అని తెలిపారు.
- వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడగా, విద్యార్థులు మరియు అతిథుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.