*ఖైరతాబాద్ గణేష్ సన్నిధిలో గ్రాండ్‌గా ‘శివ టీవీ’ ప్రారంభం*

ఖైరతాబాద్‌లోని శ్రీ గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా కొలువుదీరిన ఖైరతాబాద్ బడా గణేష్ స్వామివారి ఆశీస్సులతో ‘శివ టీవీ’ గ్రాండ్‌గా ప్రారంభమైంది.
శివ టీవీ టీమ్ ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా ఛానల్ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పి. విజయారెడ్డి మరియు ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ మరియు ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
నూతనంగా ప్రారంభమైన శివ టీవీ ప్రజలకు నిష్పక్షపాతమైన వార్తలు, విశ్వసనీయమైన సమాచారం అందిస్తూ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
ఖైరతాబాద్ బడా గణేష్ ఆశీస్సులతో శివ టీవీకి నూతన ఆరంభం లభించింది.















Leave a Reply