*శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై “దక్షిణ కాళీ” చిత్రానికి సంగీతం అందించనున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ*
శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై మీసాల వాణి నాయుడు కథను అందించిన నిర్మాతగా తోట కృష్ణ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం దక్షిణ కాళీ. ఈ చిత్రానికి మీసాల నాగ వంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండగా సాయినాథ్ మాటలను అందించారు. సంపంగి, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఘంటాడి కృష్ణ గారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందజేయడం ప్రారంభించారు.
డివోషనల్ బ్యాకౌంట్లో రానున్న ఈ చిత్రం అద్భుతమైన వి.ఎఫ్.ఎక్స్ తో రానుంది. ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ పరిసర ప్రాంతంలో జూలై నుండి షూటింగ్ ప్రారంభం కానుండగా ఒకటే షెడ్యూల్లో చిత్ర బృందం పూర్తి చేయాలనుకుంటున్నారు. చిత్రంలో కాళీ మాతగా ఒక ప్రముఖ హీరోయిన్ నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
