ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్




వసంత్, భాగ్యలక్ష్మి, రమ్య హీరో హీరోయిన్లుగా దర్శకుడు టి.రాము రూపొందిస్తున్న మూవీ అలలు లేని సముద్రం. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో అలలు లేని సముద్రం సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో
అతిథిగా వచ్చిన నిర్మాత బాలాజీ నాగలింగం మాట్లాడుతూ – దర్శకుడు రాము నాకు బాగా పరిచయం. ఆయన ఈ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు ఇండస్ట్రీలో చిన్న చిత్రాలకు పరిస్థితులు అంత బాగా లేవని చెప్పాను. అయినా పట్టుదలగా ఆయన మూవీ రూపొందించారు. అలలు లేని సముద్రం మూవీ ట్రైలర్ బాగుంది. ఈ సినిమాకు నా వంతు సపోర్ట్ చేస్తా. అన్నారు.
అతిథిగా వచ్చిన వేణు మాధవ్ మాట్లాడుతూ – అలలు లేని సముద్రం సినిమా ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ రాము ఎంతో సహజంగా సినిమాను రూపొందించాడు. సముద్రం అంటే అలలు ఉండాల్సిందే. అలలు లేకుండా సముద్రం ఎలా ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు చూపించబోతున్నారు. అన్నారు.
నటి రోజారాణి మాట్లాడుతూ – అలలు లేని సముద్రం సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో పనిచేస్తున్నప్పుడు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు రాము మేము నటించేలా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
అతిథిగా వచ్చిన నిర్మాత రామశర్మ మాట్లాడుతూ – ఈ రోజుల్లో చిన్న సినిమా నిర్మించడం అంటే కష్టమైన వ్యవహారం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దర్శకుడు రాము అలలు లేని సముద్రం సినిమాను రూపొందించాడు. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా టీమ్ అందిరకీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
అతిథిగా వచ్చిన కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ – నేనూ ఆర్టిస్టు అవ్వాలనే కలగన్నాను. అయితే క్రమంగా పాలిటిక్స్ వైపు వచ్చాను. దర్శకుడు రాము సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయనతో నేను త్వరలోనే ఓ సినిమా నిర్మించబోతున్నాను. మంచి కథ తయారు చేసుకోమని చెప్పాను. ఆ సినిమా అనౌన్స్ మెంట్ కూడా త్వరలో చేస్తాం. అన్నారు.
దర్శకుడు టి.రాము మాట్లాడుతూ – అలలు లేని సముద్రం సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన మిత్రులు అందరికీ థ్యాంక్స్. మీరంతా నా బలం. మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సినిమా కోసం మా టీమ్ బాగా సపోర్ట్ చేశారు. నా మీద మా నిర్మాత రాంరెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను. ఆయన ఈ రోజు ట్రైలర్ లాంఛ్ కు రాలేకపోయారు. ప్రస్తుతం మా మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అక్టోబర్ , నవంబర్ లో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అలలు లేని సముద్రం అనే టైటిల్ కు జస్టిఫికేషన్ ఇచ్చేలా మూవీ ఉంటుంది. నా దర్శకత్వంలో మరికొన్ని మూవీస్ రాబోతున్నాయి. అన్నారు.
నటీనటులు – వసంత్, భాగ్యలక్ష్మి, రమ్య, సురభి ప్రియాంక, సురభి వీణ, సురభి అరుణాదేవి, సురభి శేషుకుమారి, సురభి జ్యోతి, సుందరమ్మ, రోజారాణి, తదితరులు
టెక్నికల్ టీమ్
——————
మేకప్ – నారాయణ
ఆర్ట్ – చౌదరి
ఎడిటింగ్ – వేణు చౌదరి
కెమెరా – పి.నారాయణ
సంగీతం – అనిల్ కుమార్
నిర్మాణ నిర్వహణ – రామశర్మ, చీరాల శ్రీనివాస్
రచన, దర్శకత్వం – టి.రాము
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.