భారీ ఎత్తున AI తో నిర్మితమైన “మహాబలి కేంపే గౌడ” చిత్రం – ఫస్ట్ లుక్ & టీజర్ లాంచ్
బెంగళూరుకు స్థాపకుడైన కేంపే గౌడ గారి జీవితం ఆధారంగా రూపొందించిన భారీ చారిత్రక చిత్రం “మహాబలి కేంపే గౌడ” మొదటి లుక్ మరియు టీజర్ ను బాహుబలి వంటి అద్భుత చిత్రాలకు కథ రాసిన ప్రముఖ రచయిత శ్రీ విజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని అత్యాధునిక AI (కృత్రిమ మేధస్సు) మరియు విజువల్ ఎఫెక్ట్స్ సాంకేతికతతో రూపొందిస్తున్నారు.
భీమవరం టాకీస్ బ్యానర్‌పై ఇది 117వ చిత్రంగా రూపొందుతుంది. నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి సారథ్యంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం త్వరలో విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా విజేంద్రప్రసాద్ ప్రసాద్ గారు మాట్లాడుతూ కొత్తదనం సృష్టించడంలో మా రామసత్య నారాయణ ముందు ఉంటాడు, అలానే టీం సభ్యులకి శుభాకాంక్షలు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ నేను అడిగిన వెంటనే విజేంద్రప్రసాద్ గారు మా సినిమా 1స్ట్ లుక్, టీజర్ ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది, AI అనేది ప్రస్తుతం మానవ జీవితం లో భాగం ఐనది అని ఆ టెక్నాలజీ ద్వారా ఈ సినిమా ని తీయడం చాలా గర్వంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లాడ సాయి కృష్ణ, స్వప్న చౌదరి, నిఖిల్ VFX హర్ష టెక్నికల్ పాల్గొన్నారు.
ఈ చిత్రం చారిత్రక ప్రాధాన్యతతో పాటు, అత్యాధునిక టెక్నాలజీ సమన్వయంతో భారతీయ చలనచిత్ర రంగానికి ఒక మైలురాయిగా నిలవబోతోందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
