డా. పైళ్ల మల్లారెడ్డి , దిల్ రాజు, మరియు శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా విడుదలైన “హలో అమ్మాయి” ఇండిపెండెంట్ సాంగ్!
అమిత్, దివి జంటగా నటించిన అందమైన రొమాంటిక్ మ్యూజిక్ వీడియో “హలో అమ్మాయి” (Hello Ammayi) సంగీత అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను ‘అనుగు ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మాత లక్ష్మణ్ రెడ్డి అనుగు ఎంతో ఉన్నతంగా నిర్మించారు. విశేషమేమిటంటే.. ఈ పాటను ఒకేసారి అమెరికా, ఇండియాలో అత్యంత ఘనంగా విడుదల చేశారు. అమెరికాలోని ఛార్లెట్ TTA వేదికగా డా. పైళ్ల మల్లారెడ్డి గారు & దిల్ రాజు గారు ఇరువురు కలిసి ఈ పాటను విడుదల చేయగా, ఇండియాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీ శేఖర్ మాస్టర్ గారు విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ప్రముఖ ఆడియో సంస్థ ‘మధుర ఆడియో ఒరిజినల్స్’ ద్వారా యూట్యూబ్‌లో ఈ పాట విడుదలై విశేష స్పందన తెచ్చుకుంటోంది.
ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ అద్భుతమైన కాన్సెప్ట్ అందించడంతో పాటుగా, దర్శకత్వం, నృత్య రీతులను (Choreography) కూడా స్వయంగా నిర్వహించారు. అరుణ్ చిలువేరు అందించిన వినసొంపైన సంగీతానికి, సురేష్ బనిశెట్టి అందించిన అర్థవంతమైన సాహిత్యం, ప్రముఖ గాయకుడు దీపు గాత్రం తోడవడంతో ఈ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. కెమెరామెన్ (DOP) పృథ్వి సినిమాటోగ్రఫర్ అందించిన అద్భుతమైన విజువల్స్, అందమైన లొకేషన్లలో అమిత్, దివిల కెమిస్ట్రీ ఈ వీడియోకి హైలైట్‌గా నిలిచాయి. దివ్యారావు ఈ వీడియోకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించి నటీనటులకు స్టైలిష్ లుక్ అందించారు.
పాట సాంకేతిక బృందం:
పాట పేరు: హలో అమ్మాయి (Hello Ammayi)
నటీనటులు: అమిత్, దివి
నిర్మాణ సంస్థ: అనుగు ప్రొడక్షన్స్
నిర్మాత: లక్ష్మణ్ రెడ్డి అనుగు
కాన్సెప్ట్ – దర్శకత్వం – కొరియోగ్రఫీ: సత్య మాస్టర్
డీఓపీ (DOP): పృథ్వి సినిమాటోగ్రఫర్
సంగీతం: అరుణ్ చిలువేరు
గానం: దీపు
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
కాస్ట్యూమ్ డిజైనర్: దివ్యారావు
విడుదల: మధుర ఆడియో ఒరిజినల్స్ (Madhura Audio Originals)
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
