MRP – నీకెంత నాకెంత’మూవీ రివ్యూ
నటీనటులు :
నరేష్ అగస్త్య, డోనల్ బిష్ట్, వెన్నెల కిషోర్, సుదర్శన్, కాశిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్
నిర్మాత – దర్శకుడు: శ్రవణ్ జేష్ఠ ఎడిటర్: మార్థాండ్ కె. వెంకటేష్ సంగీతం: అజయ్ అరసాడ ఛాయాగ్రహణం (డీఓపీ): రాకేష్ కొలాంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ గాదిరాజు పీఆర్వో: కోయ దినేష్
పంచజన్య ఫీచర్స్ సమర్పణలోనరేష్ అగస్త్య హీరోగా నటించగా, డోనల్ బిష్ట్ జంటగా వెన్నెల కిషోర్, సుదర్శన్, కసిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్ నటీ నటులుగా శ్రవణ్ జేష్ఠ స్వీయ దర్శకత్వంలో వస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘MRP – నీకెంత నాకెంత’..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూ లో చూద్దాం
కథ:
ఉద్యోగాలు చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న ముగ్గురు స్నేహితులు మను ( నరేష్అగస్త్య),సుదర్శన్, కసిరెడ్డి రాజ్‌కుమార్ లు కొత్తబిజినెస్ చేయాలని భావించి తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెన్నెలకిశోర్ ,స్నేహాసింగ్ ల హెల్ప్ తో గ్యాంగ్‌స్టర్ దైవాజీ దగ్గర 50 లక్షలు అప్పు తీసుకుంటారు. ఈ క్రమంలో మను కు, తన గర్ల్ ఫ్రెండ్ అమృత (డోనల్ బిష్ట్) ల మధ్య చిన్న విబేధాలు వచ్చి విడిపోతారు.మరో వైపు వీరు పెట్టిన బిజినెస్ ఫెయిల్ అవ్వడంతో. . అనుకున్న టైం కు అప్పు తీర్చలేమోమోఅని వీరు ముగ్గురు ఒక ప్లాన్ చేస్తారు..ఆ ప్లాన్ ఫెయిల్ అయి అనుకోని సంఘటనలో ఇరుక్కుంటారు.వీరు వేసిన ప్లాన్ ఏంటి..వీరుఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు.విడిపోయిన లవర్ తో కలుస్తాడా. చివరికి తీసుకున్న అప్పును తీర్చారా లేదా అనేది తెలుసు కోవాలి అంటే కచ్చితంగా MRP సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
నరేష్ అగస్త్య ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్,డోనల్ బిష్ట్ గ్లామర్
వెన్నెల కిషోర్, సుదర్శన్ కామెడీ బాగా వర్కౌట్ అయింది
గగన్ విహారి,హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్ నటన బాగుంది
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది
కొన్ని కామెడీ సన్నివేశాలు రిపీట్ అయిన భావన కలుగుతుంది
ఫస్ట్ ఆఫ్ స్లో అనిపిస్తుంది
క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ లేటవడం
టెక్నీషియన్స్ పనితీరు
శ్రవణ్ జేష్ఠ దర్శకత్వ పనితీరు బాగుంది
రాకేష్ కొలాంచి సినిమాటోగ్రఫీ, అజయ్ అరసాడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు బాగున్నాయి
ఫైనల్
“MRP” కొత్త కథ కాకపోయినా, కామెడీతో పాటు థ్రిల్‌ను ఆస్వాదించే ప్రేక్షకులకు ఒక మంచి టైమ్‌పాస్ ఎంటర్టైనర్.
Rating 3.5
Most entertaining film this year
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
