ఎ స్టార్ ఈజ్ బార్న్ టైటిల్ మార్పు… “మ్యానిప్యూలేటర్ “గా త్వరలో ప్రేక్షకుల ముందుకు !!!
దర్శకుడు బి.గోపాల్ చేతుల మీదుగా మ్యానిప్యూలేటర్
ఫస్ట్ లుక్ విడుదల !!!
టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. కళ్యాణ్ శివ్ ని హీరోగా పరిచయం చేస్తూ “ఏ స్టార్ ఈజ్ బార్న్” ఇప్పుడు ఈ సినిమా మ్యానిప్యూలేటర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మ్యానిప్యూలేటర్
ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ ఆవిష్కరించారు. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, సోఫియా ఖాన్ ఊహ రెడ్డి ముగ్గురు నూతన కథానాయికలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. క్యారక్టర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో పక్కా కల్ట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతోంది.
ఈ సినిమాలో 43 మంది కొత్త నటీనటులు నటిస్తుండడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండటం విశేషం.
త్వరలో ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా జరుపుకుని, విడుదలకి సిద్ధమవుతుంది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అనేక ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
