తెలంగాణ రాష్ట్ర బాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారితో ఈ రోజు యువ చిత్రదర్శకుడు తల్లాడ సాయి కృష్ణ గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.







ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తల్లాడ సాయి కృష్ణ గారు మాట్లాడుతూ:
“మామిడి హరికృష్ణ గారు ప్రారంభించిన ‘సినీవారం’ వంటి కార్యక్రమాల ద్వారా నాతో పాటు ఎంతో మంది యువ ఫిల్మ్ డైరెక్టర్లకు అవకాశాలు కల్పించి, నేడు వారు పెద్ద పెద్ద సినిమాలు చేసే స్థాయికి చేరేలా మార్గం సుగమం చేశారు. ఆయన పాత్ర ఈ విషయంలో ఎంతో కీలకమైనది” అని అన్నారు.
ఈ సమావేశం భవిష్యత్తులో సినిమా, సాంస్కృతిక రంగాల పరస్పరాభివృద్ధికి దోహదపడేలా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్ రాజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.