భారతదేశంలో తొలి 100% VFX ఆధారిత సినిమా – “హనీ కిడ్స్” లో హీరోయిన్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విప్లవాత్మకమైన మైలురాయిగా నిలిచే చిత్రంగా “హనీ కిడ్స్” రూపొందుతోంది. ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి 100% VFX ఆధారిత సినిమాగా గుర్తింపు పొందబోతోంది.
ఈ చిత్రాన్ని దర్శకుడు హర్ష.ఎం గారు స్వీయ దర్శకత్వంలో అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ-సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథాంశం ప్రేక్షకులను కొత్త లోకాలకు తీసుకెళ్లనుంది.
తల్లాడ సాయికృష్ణ,అమ్మినేని స్వప్నా చౌదరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్,వినోధ్ నువ్వుల, కృష్ణ, తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరి నటనకు తోడు అత్యాధునిక గ్రాఫిక్స్ టెక్నాలజీ ఈ సినిమాను అద్భుతమైన విజువల్ అనుభవంగా మార్చబోతోంది.
ఈ సినిమాకు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ సినిమాకు నూతన దిక్సూచి చూపించబోయే ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయ్యింది.
ప్రేక్షకులను విభిన్నమైన దృశ్యాలను అనుభవించేలా చేసే ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.ఐతే ఈ సినిమా లో హీరోయిన్ పోస్టర్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా స్వప్న చౌదరి అమ్మినేని మాట్లాడుతూ ఈ జోనర్ సినిమాలు పక్కా పిల్లలకి బాగా నచ్చుతుందని అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
