*వినాయక చవితి శుభాకాంక్షలతో మంచు లక్ష్మి ‘దక్ష’ టీజర్ విడుదల.. సెప్టెంబర్ 19న సినిమా విడుదల*
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఇందులో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు, మంచి మెసేజ్‌తో వస్తున్న ఇలాంటి సినిమాలు ఇప్పుడవసరం అంటూ సెన్సార్ సభ్యులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన టైటిల్ పాత్రను సెన్సార్ బోర్డు సభ్యులు కొనియాడారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర టీజర్‌ను వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం విడుదల చేసింది చిత్రబృందం.
ఈ టీజర్లో ఇప్పటి వరకు మంచు లక్ష్మి కనిపించని వీరోచిత రోల్లో, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. వింత ఆకారంలో ఎలియన్ వంటి ఓ జీవి మనుషుల్ని దారుణంగా చంపే సన్నివేశంతో టీజర్ మొదలైంది. అలాగే ఓ వింత వ్యాధి నేపథ్యం, దాని వెనుక కారణం ఏంటనే ఇంట్రస్ట్‌ని ఈ టీజర్ కలగజేస్తుంది. సముద్ర ఖని, విశ్వంత్, సిద్ధిక్, జెమినీ సురేష్ వంటి వారందరూ ఇందులో కీలక పాత్రలు పోషించినట్లుగా టీజర్ తెలియజేస్తుంది. ఇక చివరిలో డాక్టర్ మోహన్ బాబు కనిపించిన ఒకే ఒక్క షాట్.. టీజర్ స్థాయిని పెంచేసింది. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రాణం అనే హింట్ ఇచ్చేసింది. ఓవరాల్‌గా టీజర్‌తో సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడేలా చేశారు మేకర్స్.
మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: అచు రాజమణి
ఛాయాగ్రహణం: గోకుల్ భారతి
నృత్య దర్శకురాలు: బృంద
పి ఆర్ ఓ:బి. వీరబాబు
నిర్మాత : డా:మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రసన్న,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ కృష్ణ మల్లా
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.




