విశిష్ట అతిథుల సమక్షంలో ఘనంగా ‘మహా సంద్రం’ పూజా కార్యక్రమాలు
ప్రస్తుతం కొత్త కంటెంట్ చిత్రాలు వస్తున్నాయి. కొత్త తరం ఇండస్ట్రీలోకి వస్తూ డిఫరెంట్ సబ్జెక్టులతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మహా సంద్రం’ అనే యాక్షన్ డ్రామాతో కొత్త టీం రాబోతోంది. నవీనీత్ రైనా హీరోగా రాబోతోన్న ఈ చిత్రానికి శేషఉ రావెళ్ల, కార్తికేయ. వి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వీవీఎం క్రియేషన్స్, కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని కార్తికేయ. వి నిర్వర్తించనున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను శుక్రవారం నాడు నిర్వహంచారు. ఈ ఈవెంట్‌కు దామోదర ప్రసాద్, ఎన్. శంకర్, సముద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పూజా కార్యక్రమాల అనంతం దామోదర ప్రసాద్ క్లాప్ కొట్టగా.. ఎన్. శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. పద్మనాభరెడ్డి, రామసత్యనారాయణ స్క్రిప్ట్ అందజేశారు.
ఈ చిత్రానికి ప్రేమ్ రాజ్ ఎనుముల డైలాగ్స్ అందించనున్నారు కళ్యాణ్ సామి కెమెరామెన్‌గా, జగదీష్ ఎడిటర్‌గా పని చేయనున్నారు.
నటీనటులు : నవనీత్ రైనా, టైగర్ శేషు, పెద్ది రాజ్, మళ్లీఖార్జున, ప్రతాప్ చల్లా తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : వీవీఎం క్రియేషన్స్, కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్పి
నిర్మాత : శేషు రావెళ్ల, కార్తికేయ.వి
కథ, కథనం, దర్శకత్వం : కార్తికేయ. వి
కెమెరామెన్ : కళ్యాణ్ సామి
సంగీత దర్శకుడు : సుభాష్ ఆనంద్
ఎడిటర్ : జగదీష్
ఫైట్స్ : అఖిల్ నకిరేకంటి
ప్రొ. ఎగ్జిక్యూటివ్ : కేటీ మల్లిఖార్జున
ఎగ్జిక్యూటివ్ మేనేజర్ : సీతారాం (రవి వర్మ)
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
