







ఆస్ప్రింగ్ ప్రొడక్షన్ బ్యానర్లో
అమ్మినేని భాస్కర్ నిర్మాత , తరుణ్ తేజ్ దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం ” దూరం”.
మణిరూప్ , సుప్రియ లు హీరో హీరోయిన్ గా చేసిన ఈ ఇండిపెండెట్ ఫిల్మ్ సోమవారం నాడు ప్రసాద్ లాబ్ లో స్క్రీనింగ్ చేశారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటులు కిషోర్ దాస్, నిర్మాత శబరి మహేంద్ర, డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ, నటులు వినోద్ కుమార్ నువ్వుల, హీరోయిన్ స్వప్న చౌదరి లు
అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు
మాట్లాడుతూ చిన్న వయసు లో మంచి కంటెంట్ ఉన్న కథ ని తీసుకొని ఇలాంటి ఫిల్మ్ ని చేయడం వలన సినిమా మీద తరుణ్ తేజ్ కి ఉన్న మక్కువ అర్థం అవుతుంది అన్నారు.
కెమెరా పనితనం, నేపథ్య సంగీతం ఇలా టెక్నీకల్ టీం సైతం మంచి వర్క్ చేయడం వలన అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అని అన్నారు.
మా అబ్బాయి చేసిన మొదటి ప్రయత్నానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చిన అతిథులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
డైరెక్టర్ తరుణ్ తేజ్ మాట్లాడుతూ నా కథ ని నమ్మి ప్రొడ్యూసర్ గా చెసిన మా డాడీ కి స్పెషల్ గా థాంక్స్, అలానే మా టీం కి, ఇక్కడికి వచ్చిన గెస్ట్ లకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా- సుధాకర్ అక్కినేపల్లి, సంగితం- లలిత్, సౌండ్ ఎఫ్ఎక్ట్స్ – వెంకట్ లు చేశారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.



Good performance Tarun tej All the best for your future