సంక్రాంతి సందర్భంగా
“మిస్టరీ “తెలుగు సినిమా ఫ్రీ గా స్ట్రీమింగ్

తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం చేస్తూ నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా “మిస్టరీ”.PV ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మాత చేసిన ఈ సినిమా
సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ లో
ఫ్రీ స్ట్రీమింగ్ అవుతుంది.
తనికెళ్ళ భరణి, అలీ, సుమన్, తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, వెంకట్ దుగ్గిరెడ్డి , రవి రెడ్డి, సత్య శ్రీ, ఆకెళ్ల, గడ్డం నవీన్, శోభన్ బొగరాజు, ఎం.ఎస్ నాయుడు , లు ఇలా ప్రముఖ తారాగణం తో తెరకెక్కిన ఈ సినీమా థియేటర్లలో విడుదలైన చాలా రోజులకి ఇలా టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతున్నట్లు డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ సోషల్ మీడియాలో తెలిపారు.
ఒక మర్డర్ జరగడం, అసలు ఎలా ఆ క్రైం జరిగిందీ అనే కోణం లో సినిమా మొదలు అవుతుంది.
కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మంచి స్క్రీన్ ప్లే తో సినిమా సాగుతోంది.
మల్టీ లినియర్ స్క్రీన్ ప్లే ని ఈ సినిమా కి ఉపయోగించారు.మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కి సంగీతం అందించిన పవన్ ఈ సినిమా కి బ్యాక్రౌండ్ సంగీతం అందించారు.
సినిమా
చివర వరకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పొందుతారు.
1 గంట 50 నిమిషాలు నిడివిగల ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా డీజిటల్ ప్లాట్ ఫామ్ లో ఫ్రీ గా చూసే విదంగా ఉన్నందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
రచన – శివ కాకు, కెమెరా – సుధాకర్ అక్కినేపల్లి, సంగీతం- రామ్ తవ్వ, పవన్, నిర్మాత – వెంకట్ పులగం, దర్శకత్వం- తల్లాడ సాయి కృష్ణ.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
