రఘు సినిమా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన హీరో ఆకాష్ జగన్నాథ్


శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై తల్లాడ శ్రీనివాస్, తల్లాడ సాయికృష్ణ నిర్మాతలుగా కె. సాయి కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న “రఘు” సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి యువహీరో ఆకాష్ జగన్నాథ్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొని సినిమా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ… ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. ‘సినిమా టైటిల్’ అంటే ఒక పేరు మాత్రమే కాదు, ప్రేక్షకులకు సినిమా చూడాలనే ఆసక్తిని పెంచే తొలిమెట్టు. నా చేతులమీదుగా ఈ రఘు సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ, నిర్మాతలు తల్లాడ సాయికృష్ణకి, చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ… మా శిష్యుడు యువ దర్శకనిర్మాత తల్లాడ సాయికృష్ణ ప్రొడ్యూసర్ గా రఘు సినిమా ప్రారంభిస్తున్నారు. మంచి మనసుతో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన ఆకాష్ కి నా అభినందనలు. ఈ సినిమా విడుదలై నిర్మాతకి దర్శకుడికి నటీనటులకు మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను.
నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ
ఈ రఘు సినిమా మా అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న 9వ సినిమాగా రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు, అలాగే నా పుట్టినరోజు సందర్భంగా మా టీం అందరం కలిసి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆశీస్సులతో యువ హీరో ఆకాష్ జగన్నాథ్ గారి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ జరిగింది. ఇందులో దాదాపు అందరూ కొత్తవాళ్లే నటిస్తున్నారు. యంగ్ టీమ్ ని ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందున్న ఆకాష్ గారికి, పూరి జగన్నాథ్ గారికి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు కె. సాయికిషోర్, హీరోలు మహేష్ కోట, మహేష్ తారక్, హీరోయిన్ కరిష్మా, నటులు ‘బంగ్లా’ వెంకట్, రాందాసు భీంపాగా, జినక ప్రశాంత్, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ రోషన్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఏజె సంధ్యావర్షిణి-వి.ఆర్.ఎ. ప్రదీప్, డైలాగ్ రైటర్ ఎం.ఎస్. కాంత్, కోప్రొడ్యూసర్ ఉదిత్ సాయి మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
