హీరో సుమన్ గారి చేతుల మీదుగా ‘రఘు’ చిత్ర టీజర్ విడుదల
హైదరాబాద్:

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ సాయి కృష్ణ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రఘు’. కె. సాయి కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్ గారు ఈరోజు ఘనంగా ఆవిష్కరించారు.
టీజర్ విడుదల అనంతరం హీరో సుమన్ గారు మాట్లాడుతూ… ” ‘రఘు’ సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు సాయి కిషోర్ టేకింగ్, నిర్మాతలు రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించిన విధానం టీజర్లో కనిపిస్తోంది. కొత్త వాళ్ళను ప్రోత్సహిస్తున్న శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ సంస్థకు, చిత్ర యూనిట్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
చిత్ర నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ… “మా సినిమా టీజర్‌ను విడుదల చేసిన సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము” అని తెలిపారు.
నటీనటులు:
మహేష్ తారక్, మహేష్ కోట, కరిష్మా, వెంకట్, ప్రశాంత్ జెపిఆర్ (Prashanth jpr), శివ, ప్రభు, రామ్ రోహిత్, శ్రీ సూర్య, Benuebb, నరసింహ.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ (Sri Annapurna Creations)
నిర్మాత: తల్లాడ శ్రీనివాస్, తల్లాడ సాయి కృష్ణ.
దర్శకత్వం: కె. సాయి కిషోర్
మాటలు (Dialogues): ఎం.ఎస్. కాంత్ (MS Kanth)
అసిస్టెంట్ డైరెక్టర్: శ్రీనివాస్. టి
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.

