*తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో” ఐదుగురు పెద్ద , సినీ హీరోలు నటించి, సపోర్ట్ చేసిన, క్విట్ డ్రగ్స్”థియేట్రికల్, యాడ్ ఫిల్మ్ పోస్టర్ రిలీజ్*
డ్రగ్స్ కి నో చెప్పండి, మీ భవిష్యత్ ను,మీ జీవితాన్ని కాపాడుకోండి.. అనే నినాదం తో కదం తొక్కారు. యువ దర్శకుడు బి.సురేష్ పాణి, ఈయన రూపొందించిన యాడ్ ఫిల్మ్ గత జూన్ 26/2025, న,గద్దర్ అవార్డు ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే,ఫంక్షన్లో ‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు పొందింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ” క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ పోస్టర్ ను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిల్య క్విట్ డ్రగ్స్, థియేట్రికల్ యాడ్ ఫిల్మ్, పోస్టర్ ను లాంఛనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో k. క్రాంతి కిరణ్ రెడ్డి,( జనప్రియ మేనేజింగ్ డైరెక్టర్) v. కమల్ కిషన్ (డైరెక్టర్ మార్కేటింగ్),N. సతీష్ కుమార్ cfo, మరియు తెలంగాణ ఈగల్ ఫోర్స్ అవేర్నెస్ వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ థియేట్రికల్ యాడ్ ప్రచారం ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన పెంపొందించి, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ప్రకటన ప్రజలలో బలమైన ప్రభావాన్ని సృష్టించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి అనే సందేశాన్ని మరింత బలంగా చాటుతుంది. ఈ థియేట్రికల్ యాడ్ ఫిలిం లో నటించి, సపోర్టు చేసిన హీరోలు శ్రీ గోపీచంద్, శ్రీ అల్లరి నరేష్, శ్రీ నిఖిల్ సిద్ధార్థ్ , శ్రీ నారా రోహిత్, శ్రీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, గార్లకు కృతజ్ఞతలు. తెలియజేస్తున్నాము., ఈ చిత్రానికి, దర్శకత్వం బీ.సురేష్ పాణి, స్పాన్సర్స్ జనప్రియ అప్ స్కేల్ మరియు సాంకేతిక నిపుణులు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మట్ట, మేనేజర్, వెంకట్రావు పెద్దపూడి, ఎడిటర్ కె సి బి హరి. డిఓపి బన్నీ,
కాగా ఈ థియేట్రికల్ యాడ్ ఫిల్మ్, ఏప్రిల్ మొదటివారం. నుండి తెలంగాణ లోని అన్ని థియేటర్స్ లలో ప్రద్శించనున్నారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
