MOKSHA – The incarnation
ఇండిపెండెంట్ ఫిల్మ్ పోస్టర్ ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి గారు రిలీజ్ చేశారు,


ఆయన మాట్లాడుతూ..
‘ కొన్ని సీరియల్స్, చిన్న చిన్న సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అశోక్ చక్రం , తనను తాను డైరెక్టర్ గా నిరూపించుకోవడానికి, తానే ప్రొడ్యూసర్ గా మారి MOKSHA – The incarnation అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ నిర్మించాడు.
ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ . లిమిటెడ్ బడ్జెట్ లో తీసే ఈ సినిమాకోసం తనకి సహకరించే కొంతమంది యాక్టర్స్ ని ఎంచుకుని వాళ్ల సహకారంతో సినిమా పూర్తి చేసాడు. ఈ సినిమా అశోక్ కి ఒక విజిటింగ్ కార్డు లా ఉపయోగపడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నా అన్నారు. మా డైరెక్టర్ శివ నాగేశ్వర్ రావు గారు అశోక్ చక్రం గురించి చెప్పి నా దగ్గరికి తీసుకు వచ్చాడు, అతను కూడా నూతన దర్శకుడిని ప్రోత్సాహించడానికి నా దగ్గరికి తీసుకోచ్చినందుకు అభినందిస్తున్న ‘ అన్నారు..
శివ నాగేశ్వర్ రావు గారు మాట్లాడుతూ, ‘అశోక్ చక్రం నా దగ్గర ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు, తెలివైన అబ్బాయ్, మంచి టాలెంటెడ్ తనకి ఈ సినిమా ద్వారా మంచి అవకాశం రావాలని కోరుకుంటూ ముందు ముందు అశోక చక్రం ఇండస్ట్రీ లో చక్రం తిప్పాలి అని ఆశిస్తున్నా, ALL THE BEST అన్నారు.
అశోక్ చక్రం కూడా మూవీ లో ఒక ప్రధాన పాత్రలో నటించారు, మనోజ్ వేముల మరొక ప్రధాన పాత్ర చేయగా , రాంగోపాల్ రెడ్డి, శ్రీధర్ శ్రీరాముల, అరుణాచల మహేష్, పవన్ కుమార్, అర్హాన్ ముఖ్య పాత్రలు చేశారు,
ప్రొడ్యూసర్ : మైనాల సుష్మ
DOP : అశోక్ అన్నెబోయిన
మ్యూజిక్ : ఆర్యన్ బొల్ల
ఎడిటింగ్ & DI : విశ్వన్ రాజ్ DS
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
