మంత్రి అట్లూరి లక్ష్మణ్ ఆశీర్వాదంతో పేదలకు అవసరమైన వస్తు పంపకం చేసిన రామచంద్ర రాజు




హైదరాబాదులోని చందానగర్ ప్రాంతంలో తెలంగాణ మంత్రి వర్యులు అట్లూరి లక్ష్మణ్ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ నాయకుడు, యూత్ లీడర్ రామచంద్రరాజు తన పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రాంతంలోని చిరు వ్యాపారులకు తమ అభివృద్ధి కోసం తోపుడుబండ్లను అలాగే వికలాంగులకు వీల్ చైన్లను పంపిణీ చేశారు. అవసరమైన వారికి రానున్న వేసవికాలం ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని గొడుగులను పంపిణీ చేసి తన సహృదయాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన తండ్రి మాట్లాడుతూ… “పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వికలాంగులకు వీల్ చైర్స్, చిరు వ్యయపరులకు తోపుడు బండ్లు పంపిణీ చేసి నా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా పంచడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజల కోసం ఉన్న మా కాంగ్రెస్ పార్టీ తరఫున పేదలకు ఇదంతా చేయడం మాకు ఎంతో సంతృప్తికరంగా అనిపిస్తుంది” అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రామచంద్ర రాజు మాట్లాడుతూ… “ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించిన అందరికీ నా కృతజ్ఞతలు అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి విడుదల ఆశీర్వాదంతో ఈరోజు పేదలకు వారి వ్యాపారానికి ఉపయోగపడేలా తోపుడుబండ్లు, వీల్ చైర్స్ పంపిణీ చేయడం నాకు ఎంత సంతోషకరంగా ఉంది. అలాగే రానున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని పేదలకు గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయనున్నాము” అన్నారు.
కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… “మా యువ నాయకుడు రామచంద్ర రాజు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. రామచంద్ర రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము” అన్నారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
