“కేరాఫ్ రవీంద్రభారతి ” సినిమా ప్రారంభం
అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాత గా , గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా
“కేరాఫ్ రవీంద్రభారతి”.
జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన,మాస్టర్
రత్నాకర్ సాయి, ప్రణీత,
తదితరులు ముఖ్యపాత్రల్లో చేస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు
ఆదివారం నాడు రవీంద్రభారతి లో జరిగింది.తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు,
మామిడి హరికృష్ణ ముఖ్య అదితి గా విచ్చేసి డైరెక్టర్ కి కథ ని అందించి, 1స్ట్ షాట్ డైరెక్షన్ చేయగా, యువ డైరెక్టర్ నటుడు తల్లాడ సాయి కృష్ణ క్లాప్ కొట్టి టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా
మామిడి హరికృష్ణ మాట్లాడుతూ గట్టు నవీన్ నాకు చాలా కాలంగా తెలుసు, చాలా కష్టపడే వ్యక్తి.
తన మొదటి సినీమా శరపంజరం ఎలా కష్టపడి తీసారో ఆ శ్రమ నాకు తెలుసు. ఎందరో కళాకారుల కళ ఈ రవీంద్రభారతి.
60 ఏళ్ల రవీంద్రభారతి కి ఒక కళ కారుడు ఇచ్చే కళా నీరాజనం ఈ సినీమా.
సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు.
డైరెక్టర్ గట్టు నవీన్ మాట్లాడుతూ ఒక్క సారి రవీంద్ర భారతి లో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి అని చాలా మంది కళాకారులకు ఉంటుంది.
డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుంది.
హిరో అవ్వాలి అనే నా కళ మొదటి సినిమా తో జరిగింది
ఇప్పుడు నా ప్రెండ్స్ ని హిరోలు గా చేస్తున్నాను, అవకాశం ఇచ్చిన మా నిర్మాత కి ధన్యవాదాలు.
జబర్దస్త్ జీవన్ మాట్లాడుతూ
మంచి కథ తో మీ ముందుకు వస్తున్నాం సినిమా గురించి విజయోత్సవ వేడుకలో మాట్లాడుతాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ MVK మల్లిక్ మాట్లాడుతూ ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంటుంది.
పాటలు కూడా చక్కగా కుదురుతున్నాయి, మా లిరిసిస్ట్ మౌనశ్రీ మల్లిక్, అధ్వైత్ రాజ్
గారు చక్కటి సాహిత్యం అందించారు.
అలానే మా సినిమాటోగ్రఫర్ మస్తాన్ సిరిపాటి సైతం మంచి టెక్నీషియన్ అని అన్నారు.
హీరోయిన్ నవీన మాట్లాడుతూ మంచి కథలో నేను భాగం అయ్యాను,నన్ను ఈ పాత్ర లో ఎంచుకున్న డైరెక్టర్ నవీన్ గారికి ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు.
నిర్మాత టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ మంచి కoటెంట్ తో ఈ సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని కృషి చేస్తున్నాం అని అన్నారు.
ఈ సినిమా కి సినీమాటోగ్రఫీ ; మస్తాన్ సీరిపాటి, సంగీతం- MVK మల్లిక్, ఏడిటింగ్- యూనిక్ బొజ్జపల్లి
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.



