విజయవాడలో తొలి U&i రిటైల్ స్టోర్‌ను ప్రారంభించిన సినీ తార నభా నటేష్..
– దేశంలోని ప్రధాన నగరాల్లో బ్రాండ్ విస్తరణలో భాగంగా ప్రత్యేక స్టోర్…
–
– అత్యాధునిక ఆడియో సొల్యూషన్స్ మొదలు అధునాతన బ్యాటరీ, మొబైల్ యాక్సెసరీస్ వరకు అందుబాటులో…
విజయవాడ, 20 ఆగస్టు 2025: భారతదేశంలోని ప్రముఖ గాడ్జెట్, యాక్ససరీస్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయినటువంటి U&i మొట్టమొదటి ప్రత్యేకమైన రిటైల్ స్టోర్‌ను విజయవాడలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్, గవర్నర్ పెట్ లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలు
ఈ సందర్భంగా U&i డైరెక్టర్ శ్రీ పరేష్ విజ్ మాట్లాడుతూ.., “మా మొట్టమొదటి ప్రత్యేక స్టోర్‌ను విజయవాడకు తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రారంభం మా రిటైల్ విస్తరణ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, అంతేకాకుండా భారతదేశం అంతటా మేము పొందుతున్న ఆదరణ, ప్రోత్సాహం ఇక్కడి వినియోగదారులు కొనసాగిస్తారని, U&i ఉత్పత్తులను స్వీకరిస్తారని మేము విశ్వసిస్తున్నాము” అని తెలిపారు.
U&i రిటైల్ భాగస్వామి శ్రీ జశ్వంత్ మాలి మరియు శ్రీ ప్రకాష్ మాలి యాజమాన్యంలోని విజయవాడ స్టోర్.., బ్రాండ్ యొక్క రిటైల్ విస్తరణలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. స్థానిక మార్కెట్లో వారి నైపుణ్యం బ్రాండ్ యొక్క ఉనికిని మరింత ఉన్నతంగా నడిపిస్తుందని, ఈ ప్రాంతంలోని కస్టమర్లతో బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయని భావిస్తున్నారు.
విజయవాడలోని ఈ నూతన ప్రత్యేక స్టోర్ దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ దుకాణాల ద్వారా దాని లైవ్-కస్టమర్ సేవలను బలోపేతం చేయాలనే U&i సంస్థ నిబద్ధత, శాశ్వత దృక్పథంలో భాగం. వినియోగదారులు ఇప్పుడు స్టోర్ ను సందర్శించి ఉత్పత్తులను ప్రత్యక్షంగా ఎంపిక చేసుకోవచ్చు. ఈ వేదికగా బ్రాండ్ యొక్క శిక్షణ పొందిన సిబ్బంది, నిపుణుల మార్గనిర్దేశంతో, వారందించే సమాచారంతో అనువైన ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయవచ్చు.
U&i గురించి:
U&i 2019లో ప్రారంభించబడింది… అప్పటి నుండి ఇది లైఫ్ స్టైల్ టెక్నాలజీలో అతి తొందరగా కష్టమర్లకు విశ్వసనీయ బ్రాండ్ గా పేరుగాంచింది. ఈ బ్రాండ్ దృష్టి ఎల్లప్పుడూ ఆవిష్కరణ, డిజైన్ తో పాటు అధిక-నాణ్యత ఉత్పత్తులను అందించడంపై కేంద్రీకరిస్తుంది. ఈ ఉత్పత్తులు అద్భుతంగా పనిచేయడమే కాకుండా వారి కస్టమర్ల జీవనశైలికి అనుగుణంగా ఉండటం వీటి ప్రత్యేకత. అత్యాధునిక ఆడియో సొల్యూషన్స్ మొదలు అధునాతన పవర్ యాక్సెసరీస్ వరకు… U&i టెక్ యాక్సెసరీస్ ఏమేమి అందించగలవో పునర్నిర్వచించుకుంటోంది. వారి వినియోగదారులకు సజావుగా, ఆధునిక అనుభవాలను అందిస్తోంది.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.

