*ఘనంగా స్వాస్ మూవీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న “కనక” మూవీ పోస్టర్ లాంఛ్*
స్వాస్ మూవీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న కనక మూవీ పోస్టర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వాస్ ఇన్నోవేటివ్ హబ్ యానివర్సరీ కూడా సందడిగా జరిపారు. ఈ కార్యక్రమంలో స్వాస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత్రి ఆరా, కనక మూవీ డైరెక్టర్ విజయ్ అధిరాజ్, దర్శకుడు ముప్పలనేని శివ, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, రైటర్స్ సత్యదేవ్, భాషా శ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
స్వాస్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ అధినేత్రి, హీరోయిన్ ఆరా మాట్లాడుతూ – ఈ రోజు మా స్వాస్ మూవీ ప్రొడక్షన్ కనక మూవీ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేను ఒక మహిళా వ్యాపారవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో మూవీ ప్రొడక్షన్, ఇన్నోవేటివ్ హబ్, డిజిటల్ ప్రమోషన్, ఆరా ఫామ్ విల్లాస్, ఇంటీరియర్ డెకరేషన్..ఇలా వివిధ విభాగాల్లో బిజినెస్ ప్రారంభించాను. వ్యాపారంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్నాను. నాలాగా తమకు నచ్చిన రంగంలో ఎదగాలని ప్రయత్నించేవారికి ఒక తోడుగా నిలబడేందుకు స్వాస్ ఇన్నోవేటివ్ హబ్ ప్రారంభించాను. మా సంస్థలో కనక అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అందులో నేను హీరోయిన్ గా నటిస్తున్నాను. విజయ్ అధిరాజ్ గారు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రేక్షకులందరికీ నచ్చేలా, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. మా సంస్థకు కనక మూవీ మంచి ఆరంభాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
దర్శకుడు విజయ్ అధిరాజ్ మాట్లాడుతూ – నేను వందలాది యాడ్స్ ను రూపొందించాను. ఇప్పుడు కనక మూవీతో తెలుగు ఆడియెన్స్ ముందుకు దర్శకుడిగా, హీరోగా వస్తున్నాను. తమిళంలో నేను చేసిన ఓ చిత్రంలో ఆరా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కిక్ శ్యామ్ సరసన యాక్ట్ చేస్తోంది. ఆ పరిచయంతో ఈ కనక మూవీ కథ నా దగ్గరకు ఆరా తీసుకొచ్చింది. కథ విన్నాక చాలా బాగుంది అనిపించింది. అయితే మీరే దర్శకత్వం చేయాలని ఆరా చెప్పినప్పుడు సర్ ప్రైజ్ అయ్యాను. అలా కనక మూవీతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఈ రోజు మీ అందరి సమక్షంలో కనక మూవీ పోస్టర్ లాంఛ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. అన్నారు
డైరెక్టర్ ముప్పలనేని శివ మాట్లాడుతూ – ఈరోజు స్వాస్ ప్రొడక్షన్ వారి కనక మూవీ లాంఛ్ లో అతిథిగా నేను పాల్గొనడం సంతోషంగా ఉంది. కనక మూవీ పోస్టర్ చూస్తుంటే క్రియేటివ్ గా కనిపిస్తోంది. పోస్టర్ లోనే పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. హీరోయిన్ ఆరా గారికి, డైరెక్టర్ విజయ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అందరికీ పేరు తీసుకురావాలని కోరుతున్నా. అన్నారు
ది 100. మూవీ దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ… అరా గారు చేస్తున్న. సినిమా.. రియల్ ఎస్టేస్ట్.. ప్రాజెక్ట్స్ అన్ని విజయం సాదించాలి… అన్నారు..
ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – పాన్ ఇండియా ట్రెండ్ లో మనమంతా ఉన్నాం. ఏ భాషలో సినిమాలైనా మరో భాషలో ఆదరణ పొందుతున్నాయి. విజయ్ తమిళ దర్శకుడు ..అయినా మా టాలీవుడ్ లోకి వెల్ కమ్ చెబుతున్నాం. ఈ కనక మూవీ మంచి విజయాన్ని సాధించాలి. హీరోయిన్ గా ప్రొడ్యూసర్ గా ఆరాకు మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నా. అన్నారు
ప్రొడ్యూసర్ లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – కనక మూవీ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమా ఆరా గారికి టైటిల్ లాగే కనక వర్షం కురిపించాలి. తను ఇన్ని రంగాల్లో వ్యాపారవేత్తగా రాణిస్తూ మళ్లీ హీరోయిన్ గా కెరీర్ కొనసాగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆమె కోరుకున్న ఫలితాన్ని కనక మూవీ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
రైటర్ సత్యదేవ్ మాట్లాడుతూ – మనలోని ప్రతి ఒక్కరిలో ఒక ఆరా ఉంటుంది. అలాంటి ఆరానే పేరుగా పెట్టుకున్నారు ఆరా గారు. ఆమె వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. ఈ కనక చిత్రంతోనూ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.
రైటర్ భాషా శ్రీ మాట్లాడుతూ – ఆరా గారు హీరోయిన్ గా నటిస్తున్న కనక మూవీ పోస్టర్ చాలా బాగుంది. ఈ పోస్టర్ లో ఆమె మాస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. మిగతా రంగాల్లో లాగే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంది అని ఆరా గారు నిరూపించబోతున్నారు. కనక మూవీ మంచి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా. అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని కనక మూవీ టీమ్ కు తమ బెస్ట్ విశెస్ అందించారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.



