“నేను నీకు రక్ష” – రాఖీ పండుగ నేపథ్యంలోని హృద్యమైన షార్ట్ ఫిల్మ్
ఆగస్టు 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో “నేను నీకు రక్ష” షార్ట్ ఫిల్మ్ ప్రత్యేక ప్రదర్శన జరగనుంది. శ్రావ్యాంజలి దర్శకత్వం వహించిన ఈ హృద్యమైన కథలో, జినక ప్రశాంత్ హీరోగా నటించారు.
రాఖీ పండుగ భావాన్ని ప్రతిబింబిస్తూ, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని సున్నితంగా చూపించే ఈ చిత్రం, ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందని యూనిట్ భావిస్తోంది.
షార్ట్ ఫిల్మ్‌ను చూడదలచిన వారు, అదే రోజు సాయంత్రం 6 గంటలకు పైడీ జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌కి విచ్చేయవచ్చు.
ఈ సందర్భంగా దర్శకురాలు శ్రావ్యాంజలి మాట్లాడుతూ,
“ఈ చిత్రానికి మద్దతుగా నిలిచిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి, రచయిత-దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
