అట్టహాసంగా “ప్రేమ మధురం” చిత్రం టైటిల్ లాంచ్

జే.ఎల్ 14 రీల్ సినిమా ప్రొడక్షన్ మరియు
ఎన్ జి ర్ సినిమా ప్రొడక్షన్ బ్యానర్స్ పై ఎస్కే జలీల్, స్వామి దాసు నాగరత్నం నిర్మాతలుగా పరకోటి బాలాజీ రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ప్రేమ మధురం (ఇద్దరూ ఒకటయ్యారు). ఈ చిత్రానికి నిర్మాత నిర్మాత డాక్టర్ ఎస్.కె. జలీల్ లిరిక్స్ అందించడం మరొక విశేషం. చంటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రికెట్ ప్లేయర్ సంధ్య తో పాటు సుష్మ, దాక్షాయిని హీరోయిన్స్ గా నటించారు. జబర్దస్త్ గడ్డం నవీన్, పంచ్ ప్రసాద్, వింజమూరి మధు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. బుస్సా బాలరాజు ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించారు.
తెలుగు ఫిలిం చాంబర్ కోశాధికారి ముత్యాల రామదాసు గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజుల్లో ఒక చిన్న సినిమా తీయడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఆసక్తితో సినిమా చేయడానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఖర్చులు అలాగే విడుదల చేసే సమయంలో వచ్చే ఇబ్బందుల వల్ల సినిమాలు చేయడం కష్టమైపోతుంది. అయినప్పటికీ నిర్మాతలు వస్తూనే ఉన్నారు, అది పూర్తిగా కళామతల్లి గొప్పతనం. చిత్ర దర్శకుడికి, నిర్మాతలకు ఆల్ ద బెస్ట్. ఫిలిం ఛాంబర్ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రేమ మధురం అనే టైటిల్ చాలా బాగుంది. అందరూ ఈ చిత్రాన్ని ప్రోత్సహించాలి. అన్ని తరాల వారు చూసే విధంగా సినిమాలు రావాలి” అన్నారు.
తెలుగు ఫిలిం చాంబర్ జాయింట్ సెక్రెటరీ మోహన్ వడ్లపట్ల గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. ప్రేమ మధురం చిత్ర బంధం అందరికీ పేరుపేరునా ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు పరకోటి బాలాజీ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ప్రేమ మధురం అనే చిత్రం ఫ్యామిలీతో చూడదగిన కామెడీ ఇంకా యాక్షన్ ఉన్న చిత్రం. ప్రస్తుతం ప్రేక్షకులు కామెడీ చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలలో నటిస్తున్న చంటి గారు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆయన పాత్ర ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. మా చిత్ర బృందానికి అండగా నిలబడిన మోహన్ వడ్లపట్ల గారికి, ముత్యాల రామదాసు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు పోతున్నాను. ప్రేక్షకులు అంతా మా సినిమాను ఆశీర్వదించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడతారని కోరుకుంటున్నాను. అలాగే నేను గరుడ అనే మరొక చిత్రాన్ని నేను దర్శకత్వం చేయబోతున్నాను” అన్నారు.
గడ్డం నవీన్ మాట్లాడుతూ… “నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా దర్శక నిర్మాతలకు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా షూటింగ్ ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అటువంటి కంటెంట్ ఉన్న చిత్రం ప్రేమ మధురం. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాతలకు మరొక నాలుగు సినిమాలు చేసేందుకు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. చిత్రంలో నటించిన అందరికీ ఆల్ ద బెస్ట్” అన్నారు.
నటుడు వింజమూరి మధు మాట్లాడుతూ… “నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అందరికీ నా నమస్కారం. ఈ సినిమాకు బలమైనటువంటి నిర్మాతలకు ఈ చిత్రం ద్వారా మంచి పేరు, సంపాదన వచ్చి సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సమాజంలో ప్రేమ మధురం అనే నానుడి ఎక్కువ ఉంది. ఆ మధురాన్ని ఈ చిత్రంలో మరింత మధురంగా దర్శకులు చూపించడం జరిగింది. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ దాక్షాయిని మాట్లాడుతూ… “ఇది నా తొలి చిత్రం. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హీరోయిన్గా నటించడం నా చిన్ననాటి కల. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రికెట్ ప్లేయర్ సంధ్య మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం. హీరోయిన్ గా నటించిన నా కల. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం ద్వారా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది” అన్నారు.
హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. నేను ఇప్పటికే కొన్ని సినిమాలలో నటిస్తున్నాను. ఈ సంవత్సరంలో కూడా కొన్ని విడుదలకు ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో కూడా నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం షూటింగ్ కి వెళ్ళాక నా కో ఆర్టిస్టులు అంతా నాతో సహకరించి ఈ సినిమా మంచి విజయం సాధించేందుకు అండగా నిలబడతారని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో చంటి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నాకు ఈ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్ర కథ నాకు చాలా నచ్చింది. చాలా మాస్ గా ఉంటుంది. నాకు మాస్ అంటే చాలా ఇష్టం. మరొకసారి ఈ వేడుకకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
నటీనటులు : చంటి, దాక్షాయిని, సుష్మ, సంధ్య, గడ్డం నవీన్, వింజమూరి మధు, పంచ్ ప్రసాద్, గరుడా రవీంద్ర, కోటేశ్వర రావు తదితరులు.
సాంకేతిక బృందం :
రచనా దర్శకుడు : పరకోటి బాలాజీ
నిర్మాతలు : ఎస్కే జలీల్, స్వామి దాసు నాగరత్నం
ప్రొడక్షన్ మేనేజర్ : బుస్సా బాలరాజు
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
