ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి, సొంత డబ్బాలకు దూరంగా ఉండే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఒకే రోజు మూడు మహాక్షేత్రాలను దర్శించి పరవశించిపోవడాన్ని ఆయా ఆలయాల అర్చక, వేద పండిత బృందాలు అభినందిస్తూ చర్చించుకోవడం విశేషం.
ఉదయం భద్రాద్రి సీతారామ చంద్రుల కల్యాణ మహోత్సవంలో పురాణపండ శ్రీనివాస్ పాల్గొని అక్కడి పండిత వర్గాలతో కాస్సేపు వైదికమయ వైష్ణవ విశేషాల్ని ముచ్చటించడం ఒక ప్రత్యేక పవిత్రతగా చెప్పక తప్పదు. సాయంకాలం యాదాద్రి లక్ష్మీ నారసింహుని దర్శనానికి వెళ్లిన పురాణపండకు, ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయానుసారం ఘన స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించి లాంఛనప్రాయంగా మంటపంలో వేదపండిత ఆశీర్వచనాలు వర్షించడం యాదాద్రి నారసింహుని కటాక్షమేనని చెప్పాలి.
వందేళ్లకు పైగా ఎన్నెన్నో మహిమల అద్భుత చరిత్ర గలిగిన భాగ్యనగరంలోని మహావీర్ హనుమాన్ మందిర్ని ఇదే రోజు రాత్రి పురాణపండ శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజరంగబలి హనుమాన్ కోకొల్లల వరాల వైభవాల్ని ఈ సందర్భంలో మార్వాడీ బ్రాహ్మణ పూజారులు పురాణపండ శ్రీనివాస్‌కు స్పష్టంగా వివరించడం మీడియాకు దర్శనమిచ్చింది. పురాణపండ శ్రీనివాస్ వెంట ఉన్న అనుచర సహచరులు ఈ మూడు ఆలయాల ధర్మకర్తలకు, పూజారులకు, వేదపండితులకు శ్రీనివాస్ రచనా సంకలనాలను అందజేశారు.
మరొకప్రక్క తానొక్కడై ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నిర్విరామంగా, నిస్వార్ధంగా చేస్తున్న ఆర్ష ధార్మిక ఉద్యమం తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకే కాకుండా అనేక రాష్ట్రాలను దాటి దేశ దేశాల తెలుగు వారికి చేరడం గర్వకారణమని మహా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు రమణాచారి, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి అధికారులు సైతం అనేక సభల్లో గొంతెత్తి ప్రశంసల ఆశీస్సులు వర్షించడం ప్రత్యేకంగా పేర్కొనాల్సిందే !
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
