‘రఘు’ సినిమా గ్లిమ్ప్స్ విడుదల

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో కొత్తదనానికి పెద్దపీట వేస్తూ, విభిన్నమైన కథాంశంతో రూపొందున్న “రఘు” అనే సినిమా అధికారికంగా ప్రకటించబడింది.
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత తల్లాడ సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు కె. సాయి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో మహేష్ తారక్, మహేష్ కోటా, కరిష్మా,బంగ్లా వెంకట్, ప్రశాంత్ JPR, శివ, ప్రభు, రామ్ రోహిత్, శ్రీ సూర్య తదితరులు నటిస్తున్నారు.
సరికొత్త కాన్సెప్ట్‌తో, ప్రేక్షకులను ఆద్యంతం అలరించే కథాంశంతో రూపొందుతోందతున్న ఈ సినిమాకు ఎం.ఎస్. కాంత్ పవర్ఫుల్ డైలాగ్స్ అందిస్తుండగా, శ్రీనివాస్. టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో, స్వతంత్ర సినిమాలకు ఒక సరికొత్త మార్గదర్శకంగా నిలవాలనే లక్ష్యంతో చిత్రబృందం పనిచేస్తోంది.కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్ర బృందం సినిమా నుండి గ్లిమ్ప్స్ ని విడుదల చేసారు.
ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. “మంచి కథ, బలమైన సాంకేతిక బృందంతో ‘రఘు’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. స్వచ్ఛమైన లవ్ స్టొరీ తో ఎమోషనల్ టచ్ ఉండేలా ఈ సినిమా ఉంటుంది అని అన్నారు.
డైరెక్టర్ సాయి కిషోరో మాట్లాడుతూ మా యాక్టర్స్ చాలా బాగా పెర్ఫార్మన్స్ చేశారు, ఈ రోజు విడుదల చేసిన వీడియో కి మంచి రెస్పాన్స్ వచ్చింది, హీరోయిన్ నటన కి అందరూ ఫిదా అయ్యారు,
ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది అని అన్నారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
