ఎస్.ఎస్. వెంకటేష్ తెలుగు సినిమా సౌండ్ డిజైనర్, సంగీత దర్శకుడు. ఎన్నో సినిమాలకి సౌండ్ డిజైనర్ గా, సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక పేరుని తెచ్చుకున్నాడు.
1987, ఏప్రిల్ 6న సత్యవతి, హనుమంతరావు దంపతులకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించాడు.
బుచ్చిరెడ్డిపాలెంలోనూ, తరువాత ప్రకాశం జిల్లా అద్దంకిలోనూ విద్యాభాసం సాగింది. డిగ్రీ చదువుతున్నపుడు 2004లో హైరాదాబాద్ కి వచ్చాడు. అ సమయంలో తన అన్నయ్య రామోజీ ఫిలిం సిటీలో కీబోర్డ్ ప్లేయర్ గా ఉద్యోగం చేస్తుండేవాడు. తనది సంగీత కుటుంబం కావడంతో వెంకటేష్ కు కూడా సంగీతంలో ప్రవేశం ఉంది.
లక్ష్యం సినిమాకు తొలిసారిగా డబ్బింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత బహుమతి, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు సినిమాలకు పనిచేశాడు. తరువాత రామోజీ ఫిలిం సిటీలో తొలుత నేరాలు-ఘోరాలు ప్రోగ్రాంకు ఇంజనీర్ గా పనిచేసి, ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా 1000 ఎపిసోడ్స్ కు పనిచేశాడు. 2009లో ఆ ప్రోగ్రాం అయ్యాక రామోజీ ఫిలిం సిటీ నుండి బయటికి వచ్చేశాడు.
తరవాత మోహిని అనే సినిమాకు సౌండ్ ఎఫెక్ట్స్ చేశాడు. ఆ సమయంలోనే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వారి ప్రాజెక్టు కోసం 2010లో తన అన్నయ్యతో కలిసి ఏంజిల్ స్టూడియో అనే స్టూడియోకు ఏర్పాటుచేసి, 2014ల వరకు సినిమాలకు, ఆధ్యాత్మిక వీడియాలకు పనిచేశాడు. 2015లో సొంతగా ఒక స్టూడియో పెట్టి, 15 సినిమాలతోపాటు యాడ్స్, పాటలు, షార్ట్ ఫిలింలకు సౌండ్ డిజైనర్ గా, సంగీత దర్శకుడిగా పనిచేశాడు. తరువాత సంగీత దర్శకుడు మణిశర్మ దగ్గర అసిస్టెంట్ గా చేరి ఇస్మార్ట్ శంకర్ 2, ఆచార్య, మాచర్ల నియోజకవర్గం, స్వాతిముత్యం, భోళాశంకర్, కన్నప్ప, వంటి 20 సినిమాలకు పనిచేశాడు.
సినిమాలు
హనుమ
అపరిచిత దారి
చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం
నడికట్టు
ఐరా
సువార్తపురం
స్టూడెంట్స్
విఎస్ -1
స్పిరిట్
ప్రేమతీరం
2015 లో స్వప్నప్రియతో వివాహం జరిగింది. ఈటీవిలో 15ఏళ్ళపాటు న్యూస్ రీడర్ గా పనిచేసి, ప్రస్తుతం ఎన్ టీవీలో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తుంది. వీరికి ఒక కుమారుడు ఇశ్వంత్.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
