శ్రీ దత్ రాగ డాన్స్ అకాడమీ – అమెరికా నుండి ప్రముఖ నటుడు వెంకట్ డుగ్గిరెడ్డికి “అభినయం 2025” సత్కారం
ప్రముఖ సినీ నటుడు వెంకట్ డుగ్గిరెడ్డి గారికి అమెరికాలోని శ్రీ దత్ రాగ డాన్స్ అకాడమీ తరఫున “అభినయం 2025” పురస్కారాన్ని అందజేసారు. తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ, అభినయ రంగంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవాన్ని అందించారు.
ఈ కార్యక్రమం అమెరికాలో ఘనంగా నిర్వహించబడింది. తెలుగు సంస్కృతి, నాట్యం మరియు అభినయ కళలకు అమెరికాలోను ఆదరణ పెరుగుతుండటం హర్షకరం. వెంకట్ గారు ఈ అవార్డును స్వీకరించటం తెలుగు వారందరికీ గర్వకారణం.
వెంకట్ డుగ్గిరెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ, ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. ఈ సంధర్భంగా వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ అదిరే అభి నేను చంద్ర కలిసి నటించిన సినిమా ది డెవిల్స్ చేయిర్ మే22 న ఆహా ఓటీటీ లో విడుదల అవుతుంది కావున మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.

