వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ



హైదరాబాద్: వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఇటీవల జూబ్లీ హిల్స్‌లోని ఒక ప్రముఖ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను గౌరవిస్తూ సర్టిఫికేట్లు, మెడల్స్ అందజేశారు.
వినోద్ నువ్వుల మాట్లాడుతూ, “ఈ నాలుగేళ్ల ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా ఉంది. మా అకాడమీ నుండి అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం టాలీవుడ్లో పనిచేస్తుండడం గర్వంగా ఉంది. వినోద్ ఫిల్మ్ అకాడమీ కొత్త టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుంది,” అన్నారు.
ఇవే కాకుండా, ఆయన హీరోగా నటించిన ల్యాంప్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటూ మంచి స్పందనను తెచ్చుకుంది.
చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై ల్యాంప్ చిత్రాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ లో సముద్ర గారు నవోదయ ఫిలిమ్స్ అధినేత రవీంద్ర గోపాల్ గారు లాంఛనంగా ట్రైలర్ రిలీజ్ ని జీవీఎం శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వినోద్ ఫిలిం అకాడమీ సంస్థ ద్వారా ఘనంగా లాంచ్ చేయడం జరిగింది .ఈ లాంచ్ లో ప్రముఖ అతిథులుగా పృథ్వీరాజ్ గారు కార్పొరేటర్ క్రాంతి గారు చలపతి గారు డైరెక్టర్ రాజశేఖర్ గారు హీరో వినోద్ నువ్వుల మధుమతి హీరోయిన్ కోటి కిరణ్ మధుమతి హీరోయిన్ అతిథుల సమక్షంలో ట్రైలర్‌ను లాంచ్ చేయడం జరిగింది.
ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు సముద్ర గారు మాట్లాడుతూ, “ఫిల్మ్ అకాడమీలు పరిశ్రమకు మంచి సాంకేతిక నిపుణులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వినోద్ ఫిల్మ్ అకాడమీ కూడా తమ మార్కును చూపింది,” అన్నారు.
నటులు 30 ఈయర్స్ పృద్వి గారు, నిర్మాత శబరి మహేంద్రనాథ్ గారు, నటుడు రాజశేఖర్ గారు, యంగ్ డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ గారు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నారు.
కార్యక్రమం విజయవంతంగా ముగియగా, అకాడమీ భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున కార్యకలాపాలు చేపడతుందని నిర్వాహకులు తెలియజేశారు.వినోద్ ఫిలిం అకాడమీ ప్రిన్సిపాల్ ప్రముఖ హాస్య నటులు కిషోర్‌దాస్ ,బబ్లు, ఉషశ్రీ మురళి , లాంప్ మూవీ డైరెక్టర్ రాజశేఖర్ ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ నవోదయ ఫిలిమ్స్
రవీంద్రగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
