వినోద్ ఫిల్మ్ అకాడమీ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు


హైదరాబాద్‌లోని స్థానిక ఆడిటోరియంలో వినోద్ ఫిల్మ్ అకాడమీ 5వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ, మీడియా, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వేడుకకు మరింత ఉత్సాహాన్ని కలిగించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ:
“వినోద్ ఫిల్మ్ అకాడమీ యువతలోని ప్రతిభను వెలికితీస్తూ, వారిని నిజమైన కళాకారులుగా తీర్చిదిద్దడంలో విశేష పాత్ర పోషిస్తోంది. ఇలాంటి సంస్థలు ఇండస్ట్రీకి పునాది వలె ఉంటాయి,” అని అన్నారు.
సీనియర్ పాత్రికేయులు ధీరజ్ అప్పాజీ మాట్లాడుతూ:
“ఇప్పటి తరం యువతకు సినీ రంగం పై ఉన్న ఆసక్తిని విజయవంతంగా మలచే శక్తి వినోద్ ఫిల్మ్ అకాడమీకి ఉంది. ఇది అభినందనీయం.”
విజయ్ కుమార్ గుర్రపు మాట్లాడుతూ:
“ఈ అకాడమీ ద్వారా ఎంతోమంది యువత కెరీర్‌కి మంచి ఆరంభం పొందుతున్నారు. వినోద్ గారి దృష్టికోణం స్పష్టంగా కనిపిస్తోంది.”
ఆర్.కే చౌదరి గారు మాట్లాడుతూ:
“వినోద్ ఫిల్మ్ అకాడమీ అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో హృద్యమైనది. ఈ సందర్భంగా సంస్థ తరుపున నాకు అందించిన ఆర్థిక సహాయాన్ని గౌరవంగా స్వీకరిస్తున్నాను.”
ఈ సందర్భంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుండి ఆర్.కే చౌదరి గారికి చెక్‌ను అందజేశారు. ఇటీవల ఆయన వెన్నుముకకి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ తమవంతు సహాయంగా ఈ చర్య తీసుకుంది.
డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ:
“సినిమా రంగం లోకి రావాలనుకునే యువతకు మార్గం చూపిస్తున్న వినోద్ ఫిల్మ్ అకాడమీ నిజంగా గొప్ప పని చేస్తోంది. ఇలాంటి వేదికలు మరెన్నో అవసరం.”
హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ:
“నాకు ఈ రంగంలో వచ్చిన శిక్షణే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ అకాడమీ తన పాత్రను నిజంగా నెరవేరుస్తోంది.”
డాక్టర్ సతీష్ మాట్లాడుతూ:
“సినిమా ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఇలాంటి అకాడమీలు ఆ మార్పుకు వేదికలవుతాయి.”
కృష్ణ మాట్లాడుతూ:
“సాంస్కృతిక అభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి ఈ అకాడమీ బలమైన వేదిక.”
ఉష శ్రీ మేడమ్ మాట్లాడుతూ:
“వినోద్ గారు యువతపై నమ్మకంతో వారు ఎదిగే మార్గం చూపుతున్నారు. ఇది గొప్ప నాయకత్వ లక్షణం.”
ప్రిన్సిపల్ & సీనియర్ నటులు కిషోర్ దాస్ మాట్లాడుతూ:
“నటనలో క్రమశిక్షణ, అభ్యాసం ప్రధానమైనవి. వాటిని అందించడమే మా లక్ష్యం.”
ఫౌండర్ & యాక్టర్ వినోద్ నువ్వుల మాట్లాడుతూ:
“ఈ రోజు మా అకాడమీకి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మేము మూడు పెద్ద బ్యానర్లతో మ్యూచువల్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాం.
భీమవరం టాకీస్, మహా మూవీస్, శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ సంస్థలతో ఒప్పందం కుదిరింది. వీరి సినిమాల్లో మా అకాడమీ నుండి కొంతమందికి అవకాశం కల్పిస్తామని నిర్ణయించాం. ఇది మా అకాడమీ అభివృద్ధిలో మరో ముఖ్యమైన మెట్టు,” అన్నారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
