మే 15 న థియేటర్లలో
*అరేయ్ ఆపండ్రా* విడుదల


2026 మే 15న విడుదలవుతున్న ‘అరెయ్ ఆపండ్రా’ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనటుడు తల్లాడ సాయికృష్ణ, నిర్మాత అశోక్ నిమ్మల, ఈ సినిమా నటించిన కమెడియన్ భద్రం, సీనియర్ నటులు కిషోర్ దాస్, వినోద్ కుమార్ నువ్వుల, ఎడిటర్ మోహన్ తదితరులు పాల్గొని, సినిమా విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా
నిర్మాత అశోక్ నిమ్మల మాట్లాడుతూ… “ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా ‘అరెయ్ ఆపండ్రా’ సినిమా రేపు (మే 15న) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా ఈ కథ విన్నప్పుడు ఎంతగా నవ్వుకున్నానో, సినిమా పూర్తయ్యాక అవుట్‌పుట్ చూసి అంతకంటే ఎక్కువే ఆనందించాను. మా డైరెక్టర్ కమ్ హీరో సాయికృష్ణ ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. తను అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించాడు. భద్రం గారి కామెడీ, కిషోర్ దాస్ గారి అనుభవం, వినోద్ గారి నటన ఈ సినిమాకు పెద్ద అసెట్స్. రేపు థియేటర్లలో ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని నమ్ముతున్నాను. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
దర్శకనటుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నా మీద నమ్మకం ఉంచి ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా నిర్మాత అశోక్ నిమ్మల గారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఒక పక్క దర్శకత్వం చేస్తూ, మరో పక్క నటించడం అనేది పెద్ద ఛాలెంజ్. కానీ నా టీమ్ ఇచ్చిన సపోర్ట్ వల్లే అది సాధ్యమైంది. ‘అరెయ్ ఆపండ్రా’ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది మీరు రేపు థియేటర్లో చూసి తెలుసుకోవాలి. ఇదొక అవుట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. ఎడిటర్ మోహన్ గారు సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా క్రిస్ప్‌గా కట్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. మే 15న థియేటర్లలోకి వస్తున్నాం, మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి.”
కమెడియన్ భద్రం మాట్లాడుతూ… “పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు నమస్కారం. ‘అరెయ్ ఆపండ్రా’.. టైటిల్ క్యాచీగా ఉంది కదూ! టైటిల్లో ఆపండ్రా అని ఉంది కానీ, రేపు థియేటర్లలో మీ నవ్వులు మాత్రం ఎవరూ ఆపలేరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా హిలేరియస్‌గా ఉంటుంది. సాయికృష్ణ నా క్యారెక్టర్‌ను రాసిన విధానం చాలా బాగుంది. యూత్‌కి, ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అందరూ రేపు థియేటర్‌కెళ్లి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి.”
సీనియర్ నటుడు కిషోర్ దాస్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ కుర్రాళ్ల ఎనర్జీ, ప్యాషన్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా, ప్రేక్షకులకు ఏం కావాలో తెలుసుకుని సాయికృష్ణ ఈ సినిమాను మలిచాడు. నేను ఇందులో ఒక మంచి కీలక పాత్ర పోషించాను. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఆ కోవలోనే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”
నటుడు వినోద్ కుమార్ నువ్వుల మాట్లాడుతూ… “మీడియా వారికి నమస్కారం. ‘అరెయ్ ఆపండ్రా’ లాంటి మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నా పాత్రకు ఇందులో మంచి స్కోప్ ఉంది.తాను తీస్తున్న ప్రతి సినిమాలో మా వినోద్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్స్ ( నటనలో శిక్షణ పొందిన విద్యార్థులు) కి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తుందుకు తల్లాడ సాయి కృష్ణ కి ధన్యవాదాలు తెలిపారు… అలానే
అశోక్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. రేపు విడుదలవుతున్న మా సినిమాకు మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటున్నాను.”
ఎడిటర్ మోహన్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. డైరెక్టర్ సాయికృష్ణ సినిమాను ఎంత స్పష్టంగా షూట్ చేశారో, ఎడిటింగ్ టేబుల్ మీద కూడా అంతే క్లారిటీతో ఉన్నారు. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసేలా గ్రిప్పింగ్ గా వచ్చింది. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంటుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. థాంక్యూ.”
—
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
