సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న “ఆదిపర్వం”, ఆంధ్రా, తెలంగాణాలో పెరుగుతున్న థియేటర్స్
టాలీవుడ్ లో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన మూవీ “ఆదిపర్వం”. ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ నేపథ్యంలో మరో 50 థియేటర్లు పెంచుకుంది. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటించారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషించారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా “ఆదిపర్వం” చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజీవ్ మేగోటి.
థియేటర్లలో “ఆదిపర్వం” విజయవంతంగా ఆడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఆనందం వ్యక్తం చేశారు. “ఆదిపర్వం”ను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న చిత్రంగా మొదలై బిగ్ మూవీ మారుతూ రోజురోజుకు థియేటర్లు పెంచుకోవడం చాలా సంతోషంగా ఉండన్నారు. సపోర్ట్ చేసి “ది బెస్ట్ మూవీగా నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, యాక్షన్ ఆకట్టుకుంటాయని, మంచు లక్ష్మీ గారికి పేరు తెచ్చే చిత్రమవుతుందన్నారు. అలాగే హనుమంతు క్యారెక్టర్ లో ఆదిత్య ఓం నటన హైలైట్ గా నిలుస్తుందన్నారు. త్వరలోనే ఈ సినిమా విజయ యాత్ర నిర్వహించనున్నట్టు. తెలిపారు
నటీనటులు – మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి ఖత్రి , మధు నంబియార్, బీఎన్ శర్మ, బృంద, స్నేహ అజిత్, అయోషా, జ్యోతి, దేవి శ్రీ ప్రభు, శ్రావణి, గూడా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, రవి రెడ్డి, లీలావతి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీరామ్.
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – ఎస్ ఎన్ హరీశ్
మ్యూజిక్ – మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)
ఎడిటింగ్ – పవన్ శేఖర్ పసుపులేటి
ఫైట్స్ – నటరాజ్
లైన్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ బోధంగి
కొరియోగ్రఫీ – సన్ రేస్ మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్ – కేవీ రమణ
ప్రొడక్షన్ మేనేజర్స్ – బిజువేముల రాజశేఖర్ రెడ్డి, కొల్లా గంగాధర్, కంభం ప్రకాష్ రెడ్డి
కో డైరెక్టర్ – సిరిమల్ల అక్షయ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – ఘంటా శ్రీనివాసరావు
సహ నిర్మాతలు – గోరెంట శ్రావణి, రవి మొదలవలస, ప్రదీప్ కాటకూటి, రవి దశిక, శ్రీరామ్ వేగరాజు.
పీఆర్ఓ- మూర్తి మల్లాల
పీఆర్ డిజిటల్ టీమ్ – కడలి రాంబాబు, దయ్యాల అశోక్
నిర్మాణం – అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్
రచన, దర్శకత్వం – సంజీవ్ మేగోటి.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
